మునుగోడు బిజెపి గెలుపును ఎవరు ఆపలేరంటున్న కిషన్ రెడ్డి

మునుగోడు బిజెపి గెలుపును ఎవరు ఆపలేరన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి..రేపు కేంద్రమంత్రి అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారు. రేపు మునుగోడు లో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. దీనికి సంబదించిన ఏర్పట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని, నియోజకవర్గం ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే ఉన్నారని అన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మునుగోడులోనూ వస్తాయని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు టీఆర్ఎస్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. విలువలకు కట్టుబడి ఉన్న రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఓటర్లు గెలిపిస్తారని, ఇక్కడి ప్రజలు బీజేపీని స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ అభద్రతా భావంతో ఉందని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియదు గానీ అధికార పార్టీ మాత్రం గందరగోళంలోనే ఉందన్నారు. అమిత్ షా మీటింగ్ కు ఒకరోజు ముందు కేసీఆర్ సభ నిర్వహిస్తున్నారంటే.. వారిలో ఎంతో భయం ఉందో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం మునుగోడులో కుర్చీ వేసుకొని కూర్చున్నా టీఆర్ఎస్ గెలవదన్నారు.

SHARE