నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ హస్తినకు బయల్దేరనున్నారు. కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు మూడు రోజులు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయబోతున్నారు. రాష్ట్రపతి ఫలితాలు తర్వాత కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లనుండటంతో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. జాతీయ రాజకీయాలపై విపక్షాలతో చర్చించేందుకు ఢిల్లీ వెళ్లున్నారని సమాచారం అందుతోంది.

SHARE