ఆగ‌స్టు 4న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం

ఆగష్టు 4న సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా అత్యాధునిక సాంకేతికతతో నిర్మితమై పోలీస్‌ శాఖతోపాటు, ఇతర విపత్తులకు పరిశోధన కేంద్రంగా భాసిళ్లనున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఈ సెంటర్ ను ప్రారభించబోతున్నారు. బంజారా హిల్స్‌లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టుతో అనుబంధం ఉన్న అన్ని శాఖ‌ల‌కు సిటీ పోలీసు క‌మీష‌న‌ర్ సీవీ ఆనంద్‌ ఓ మెమోను రిలీజ్ చేశారు. ప్రారంభోత్స‌వానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని ఆయన కోరారు. చ‌రిత్రాత్మ‌క రీతిలో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నిర్మాణం సాగుతోంద‌ని, అయితే లాజిస్టిక్స్‌, ప్లానింగ్‌, ఎగ్జిక్యూష‌న్‌కు సంబంధించిన పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని కోరారు. క‌మాండ్ సెంట‌ర్ ప్రారంభోత్స‌వాన్ని గ్రాండ్‌గా నిర్వ‌హించాల‌ని, దీని ద్వారా హైద‌రాబాద్ సిటీ పోలీస్ ప్ర‌తిష్ట‌ను ఇనుమ‌డింప చేయాల‌ని ఆయ‌న త‌న మెమోలో తెలిపారు.

19 అంతస్థులతో అద్భు త డిజైన్‌తో నిర్మించిన ఈ భవనం తెలం గాణకు మరో అదనపు ఆకర్షనగా మార నుంది. ఈ కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో 19 అంత స్థులు నిర్మించగా, 14, 15వ అంతస్తుల వరకు ప్రజలను అనుమతించ నున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌ అందాలను వీక్షించేందుకు వీలు కల్గనుంది. ఈ కమాండ్‌ కంట్రోల్‌ సెం టర్‌ 1,12,077 చదరపు కిలోమీటర్లను కవర్‌ చేయనుంది. తెలంగాణలోని ప్రతీ ఇంచును 360 డిగ్రీల కోణంలో వీక్షించి పోలీస్‌లకు మేలు చేయనుంది. ఇందుకు పోలీస్‌ రాడార్‌ సేవలను వినియోగించ నున్నారు. క్షణాల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతంలో ఏమి జరిగినా తెలుసుకునేందుకు అత్యంత ఆధునిక పరాజ్ఞా నాన్ని ఈ కేంద్రంలో వాడుతున్నారు. మొదట్లో ఈ భవనాన్ని రూ. 350కోట్లతో అంచనా వేసినప్పటికీ పెరిగిన ధరలతో మరో రూ. 235కోట్లు అదనంగా ఖర్చయ్యాయి. దీంతో మొత్తం వ్యయం రూ. 585కోట్లకు చేరింది. ఇందులో ఐదు టవర్లు ఉన్నాయి. టవర్‌ ఏ లో హైదరాబాద్‌ సీపి ఆఫీస్‌, టవర్‌ బీలో టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌ ఉంది. ఈ సెంటర్‌లో ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రెస్పాన్స్‌ సిస్టం పనిచేయనుంది. డయల్‌ 100 వార్‌రూం కూడా ఇక్కడినుంచే నడుస్తుంది.

SHARE