తెలంగాణ లో మరో కొత్త మండలం..

తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త మండలానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. మహబూబాబాద్ జిల్లాలోని ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. రాష్ట్రంలో మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఇనుగుర్తికి ఉన్న నేపథ్యంలో, ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇనుగుర్తి మండలం కావడం తో ఆ గ్రామా ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. కేసీఆర్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు మరో మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు కవిత, రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రెండురోజుల క్రితం ఏర్పాటు చేసిన 13 మండలాల జాబితా ఇలా ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఆలూర్, డొంకేశ్వర్ సాలూర , మహబూబాబాద్ జిల్లాలో సీరోల్ , నారాయణ పేట జిల్లాలో గుండుమల్, కొత్తపల్లె వికారాబాద్ జిల్లాలో దుడ్యాల్, మహబూబ్ నగర్ జిల్లాలో కౌకుంట్ల. నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్. సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట్. కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి. జగిత్యాల జిల్లాలో ఎండపల్లి, భీమారం. ఇప్పుడు మరోటి ఇనుగుర్తి. ప్రస్తుతం కేసముద్రం మండలంలో ఉన్న ఇనుగుర్తి..ఇప్పుడు కొత్త మండలంగా మారబోతోంది.

SHARE