ఢిల్లీ వెళ్లిన కేసీఆర్…మూడు రోజులు అక్కడే మకాం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. కిఇకార్ తో పాటు పలువురు మంత్రులు , ఎంపీలు వెళ్లారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌ల‌తో భేటీ కానున్నారు. జాతీయ స్థాయి నాయ‌కుల‌ను కలిసి దేశం ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించున్నారు.

పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్న వేళ.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై టిఆర్ఎస్ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఇప్పటికే ఒకసారి ఎంపీలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గోదావరి వరదల కారణంగా తెలంగాణ ప్రజలు అల్లాడుతుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఢిల్లీలో ఎండగట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశంపైనా విపక్ష నేతలతో చర్చించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ వెంట ఎంపీలు సంతోష్‌ కుమార్‌, రంజిత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

SHARE