కాంగ్రెస్‌, టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు – ఈటెల

కాంగ్రెస్‌, టిఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్ రెడ్డి తో పాటు కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, ఎర్రబెల్లి ప్రదీప్‌ రావు, దాసోజు శ్రవణ్‌తో పాటు మరికొంత మంది బిజెపి తీర్థం పుచ్చుకునే ఆస్కారం ఉందని తెలిపారు. టిఆర్ఎస్ సర్కార్‌ ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టే ఉద్యమకారులు ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఈటల రాజేందర్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అంతరించిపోవడంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వ్యవహారం నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు.

అలాగే సీఎం కేసీఆర్ కు ఈటెల సవాల్ విసిరారు. హుజురాబాద్‌‌లో కొట్లాడుదామా ? గజ్వేల్ లో కొట్లాడుదామా సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే పొలిమేరల దాకా తరిమి కొట్టే శక్తి ఉందన్నారు. నీచపు కుట్రలను, కేసీఆర్ ఎత్తులను తిప్పి కొట్టాల్సిన అవసరముందన్నారు. ప్రశాంతంగా ఉంటున్న హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

SHARE