దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ను వీడటం పట్ల జీవన్ రెడ్డి కామెంట్స్

ఐసీసీసీ అధికార ప్రతినిధి పదవికి,కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి దాసోజు శ్రవణ్ రాజీనామా చేయడం పట్ల కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. పీసీసీ అధ్యక్షుడు కేవలం రాష్ట్ర పార్టీ యంత్రాంగానికి, హైకమాండ్ కు సమన్వయకర్త మాత్రమేనని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడిని సంతృప్తి పరచడం సాధ్యం కాదని అన్నారు. సోనియా నాయకత్వంలోనే అందరం పని చేస్తున్నామని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఆయన పరిధిలోనే పని చేస్తున్నారని అన్నారు.

అలాగే మల్లు రవి మాట్లాడుతూ..దాసోజు శ్రవణ్ పై ఒత్తిడి తెచ్చి పార్టీ మారేలా చేశారని అన్నారు. బీజేపీ వాళ్ల రాజకీయాలు దిగజారిపోయాయని చెప్పారు. దాసోజు శ్రవణ్ పై తాను వ్యక్తిగతంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని… అయితే, రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖండిస్తున్నానని అన్నారు. ఇదిలా ఉంటె ఈరోజు ఢిల్లీ లో శ్రవణ్ ..బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ ను కలిశారు. దాసోజు శ్రవణ్ బిజెపి లో చేరడం ఫై తరుణ్‌చుగ్‌ క్లారిటీ ఇచ్చారు. దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు.

SHARE