తెలంగాణ లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు వదలడం లేదు. ఇప్పుడు మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ పేర్కొంది.

ఈ నెల7న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజగిరి, మహబూబాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

SHARE