మ‌హ‌బూబాబాద్ జిల్లాలో అత్యధిక వ‌ర్ష‌పాతం నమోదు

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వాగులు , వంకలు పొంగిపొర్లాయి. వందల ఇల్లు నీటమునిగాయి. ఈ భారీ వర్షాల నుండి ఇంకా ప్రజలు తేరుకోకముందే..మరోసారి తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు పడుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం అత్యధికంగా మ‌హ‌బూబాబాద్ జిల్లాలో వర్షాలు పడ్డాయి.

ఆ వివరాలు ఇలా ఉన్నాయి

దంతాల‌ప‌ల్లి(మ‌హ‌బూబాబాద్‌) – 20.3 సెం.మీ.
దేవ‌ర‌పుప్పుల మండ‌లం(జ‌న‌గామ‌) – 18 సెం.మీ.
నెల్లికుదురు మండ‌లం(మ‌హ‌బూబాబాద్) – 14.8 సెం.మీ.
కొమ్ముల‌వంచ‌(మ‌హ‌బూబాబాద్‌) – 14.3 సెం.మీ.
పెద్ద‌నాగారం(మ‌హ‌బూబాబాద్‌) – 14 సెం.మీ.
ముకుందాపురం(సూర్యాపేట‌) – 13.6 సెం.మీ.
తొర్రూర్ మండ‌లం(మ‌హ‌బూబాబాద్‌) – 12.5 సెం.మీ.

ప‌మ్మీ(ఖ‌మ్మం) – 11.8 సెం.మీ.
నాగుల‌వంచ‌(ఖ‌మ్మం) – 11.6 సెం.మీ.
ఆత్మ‌కూర్(సూర్యాపేట‌) – 11.6 సెం.మీ.
ఉర్లుగుండ‌(సూర్యాపేట‌) – 11.5 సెం.మీ.
గుండాల మండ‌లం(యాదాద్రి) – 11.4 సెం.మీ.
మేళ్ల‌చెరువు(సూర్యాపేట‌) – 11.2 సెం.మీ.
మామిళ్ల‌గూడెం(సూర్యాపేట‌) – 11 సెం.మీ.
న‌డిగూడెం(సూర్యాపేట‌) – 10 సెం.మీ.
మ‌రిపెడ మండ‌లం(సూర్యాపేట‌) – 10 సెం.మీ.

ఇక హైదరాబాద్ లోను శుక్రవారం ఉదయం నుండి వర్షం పడుతూనే ఉండగా..సాయంత్రం కుండపోత వర్షం పడింది. హాఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 9.85 సెంమీ వర్షపాతం నమోదైంది. బాలానగర్‌ 9.83 సెం.మీ, గాజుల రామారం 9.7 సెం.మీ, బాలాజీనగర్‌ 8.7 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 8.5 సెం.మీ వర్షపాతం జీడిమెట్ల 9.7 సెం.మీ రాజేంద్రనగర్‌ 8.2 సెం.మీ,కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, మాదాపూర్‌ 7.65 సెం.మీ, మౌలాలీ 7.25 సెం.మీ, నెరేడ్‌మెట్‌ 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్‌, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్‌, హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది. మరోపక్క మరో రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

SHARE