తెలంగాణ లోని ఆ నాలుగు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ..

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. షియర్‌ జోన్‌ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, నగరంలో అక్కడక్కడా భారీ వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది.

అలాగే రాష్ట్రంలోని నాల్గు జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఇక హైదరాబాద్ లో శుక్రవారం ఉదయం నుండి వర్షం పడుతూనే ఉంది. ఇక సాయంత్రం కుండపోత వర్షం పడింది.

హాఫీజ్‌పేట్‌లో అత్యధికంగా 9.85 సెంమీ వర్షపాతం నమోదైంది. బాలానగర్‌ 9.83 సెం.మీ, గాజుల రామారం 9.7 సెం.మీ, బాలాజీనగర్‌ 8.7 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 8.5 సెం.మీ వర్షపాతం జీడిమెట్ల 9.7 సెం.మీ రాజేంద్రనగర్‌ 8.2 సెం.మీ,కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, మాదాపూర్‌ 7.65 సెం.మీ, మౌలాలీ 7.25 సెం.మీ, నెరేడ్‌మెట్‌ 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్‌, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్‌, హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది.

SHARE