ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు

టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీష్ రావు వెళ్లారు. జీవన్ రెడ్డి ఫై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు మంత్రి హరీష్ రావు తో పాటు మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు జనార్దన్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

అంతకుముందు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నరసింహచార్యులు, ఆకుల లలిత, గెల్లు శ్రీనివాస్ యాదవ్ జీవన్ రెడ్డిని పరామర్శించారు. .

అలాగే డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించారు. శివుడి ఆశీస్సుల వల్ల ప్రాణ గండం తప్పిందన్నారు. జీవన్ రెడ్డికి ధైర్యం చెప్పారు.

SHARE