లోన్ ఆప్ వేధింపులకు మరో వ్యక్తి బలి..

లోన్ యాప్ వేధింపులకు వరుస మరణాలు చోటుచేసుకుంటేనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది లోన్ యాప్‌ల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడగా..తాజాగా మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో చోటుచేసుకుంది.

సుధాకర్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం గోల్డెన్ రూపీ యాప్ ద్వారా ఆరువేల రుణం తీసుకున్నాడు. అయితే గడువు ముగియడం తో గోల్డెన్ రూపీ లోన్ యాప్ ఏంజట్ల నుంచి వేదింపులు మొదలయ్యాయి. కాస్త సమయం ఇవ్వండి డబ్బులు కట్టేస్తానని చెప్పినప్పటికీ వారు వేదింపులు ఆపలేదు. భార్య అశ్లీల ఫోటోలు పోర్న్ యాప్ లో పెట్టమని అవమానించిన ఏజంట్లు.. దారుణమైన భూతులతో చిత్ర హింసలు చేశారు. సుధాకర్ బందువులు, స్నేహితులకు అసభ్యకరంగా మెస్సేజ్ లు పంపారు. దీంతో వేదింపులు తట్టులేక సూసైడ్ చేసుకుంటున్నాని అన్నకు ఫోన్ చేశాడు సుధాకర్. ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై శవమై తేలాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ మధ్యనే విజయవాడ లోను ఓ వివాహిత రూపీ యాప్ ఏంజట్ల వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఇండియన్ బుల్స్, రూపి ఎక్స్‌ఎమ్ రుణ యాప్‌లో రూ.20 వేలు లోన్ తీసుకోగా రూ.8 వేలు బకాయి ఉంది. దాంతో ఆమెకు రుణ యాప్‌ల కాల్ సెంటర్ నుంచి వెండిపూలు మొదలయ్యాయి. న్యూడ్ ఫోటోలు, కాంటాక్ట్ నంబర్స్‌కు పెడతామని బెదిరించడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

SHARE