భద్రాచలం వద్ద భారీగా పెరిగిన గోదావరి

మరోసారి భద్రాచలం ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో ఉన్నారు. కొద్దీ రోజుల క్రితం భారీ వరదలకు గోదావరి నీటిమట్టం 70 అడుగుల మేర ప్రవహించిన సంగతి తెలిసిందే. దీంతో భద్రాచలం ముంపు గ్రామాలతో పాటు భద్రాచలం లోని పలు కాలనీ లు నీటమునిగాయి. దాదాపు వారం రోజుల పాటు ముంపు గ్రామాల ప్రజలు తమ ఇళ్లను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలలో ఉన్నారు. ఇక ఇప్పుడు మరోసారి భయం భయంగా బ్రతుకుతున్నారు.

బుధవారం ఉదయం 5 గంటలకు 54.3 అడు‌గు‌లకు చేరు‌కుంది. అయితే మంగళవారం రాత్రి 8 గంటలకు 53 అడుగులు దాటడంతో అధి‌కా‌రులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 14,92,679 క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నది. కాగా, గోదా‌వరి నీటిమట్టం పెరు‌గు‌తుం‌డ‌టంతో భద్రా‌చలం, పిన‌పాక నియో‌జ‌క‌వ‌ర్గా‌ల్లోని పలుమండ‌లాలు అనేక గ్రామాలు జల‌ది‌గ్బం‌ధంలో చిక్కు‌కు‌న్నాయి. భద్రా‌చలం నుంచి చర్లకు వెళ్లే ప్రధాన రహ‌దా‌రిపై వరద నీరు పెద్దఎత్తున ప్రవ‌హిం‌చ‌డంతో రాక‌పో‌క‌లకు అంత‌రాయం కలి‌గింది. భద్రా‌చలం నుంచి ఛత్తీ‌స్‌‌గఢ్‌, ఒడిశా ప్రాంతా‌లకు వెళ్లే‌ప్రధాన రహ‌దా‌రిపై నెల్లి‌పాక వద్ద వరద నీరుచేర‌డంతో రాక‌పో‌కలు పూర్తిగా స్తంభించాయి.

SHARE