సీఎం పర్యటన నేపథ్యంలో గుంతల రోడ్ల కు ప్యాచ్ వర్క్ చేసిన GHMC

సీఎం కేసీఆర్ మునుగోడు కు రోడ్డు మార్గాన వెళ్తుండడం తో గుంతల రోడ్ల కు ప్యాచ్ వర్క్ చేసింది GHMC . ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ కూడా గుంతలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు రోడ్లను బాగు చేయండని మొరపెట్టుకున్నా పట్టించుకోని ఘ్న్క్..కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కేసీఆర్ వెళ్లే రూట్ లో రోడ్ల మీద గుంతలను జీహెచ్ఎంసీ మాన్ సూన్ సెంట్రల్ ఎమర్జెన్సీ టీమ్స్ హడావుడిగా పూడ్చి వేస్తున్నాయి. హడావుడిగా సాగుతున్న రోడ్ల మరమ్మత్తులు స్థానికులు, ఆ రూట్లో వెళ్లే వారిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా.. శాశ్వతంగా రోడ్లు బాగు చేయాలని జనం కోరుతున్నారు.

మరోపక్క కేసీఆర్ మునుగోడు టూర్ నగరవాసులను చిక్కుల్లో పడేసింది. ఆయన రోడ్డు మార్గానా వెళుతుండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను నిలిపివేశారు. సిటీలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో.. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కేసీఆర్ సభతో.. విజయవాడ – హైదరాబాద్ హైవేపై ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలను చిట్యాల మీదుగా మళ్లిస్తున్నారు. చిట్యాల-రామన్నగూడెం, భువనగిరి మీదుగా హైదరాబాద్ కు వాహనాలు మళ్లిస్తున్నారు పోలీసులు.

SHARE