ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి..

టిఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కొడుకుపై దుండగులు బెదించిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నామా నాగేశ్వరరావు కొడుకు పృథ్వీతేజ..ఆదివారం ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి తిరిగి వస్తుండగా..మార్గమధ్యలో దుండగులు కారు ఆపి..అందులోకి చొరబడి పృథ్వీతేజను బెదిరించారు. అతడి దగ్గరి నుండి రూ.75 వేలు తీసుకొని అక్కడి నుండి పరారయ్యారు.

ఆ తర్వాత నేరుగా ఇంటికి వచ్చిన పృథ్వీతేజ..జరిగిన విషయాన్నీ తన సిబ్బందికి తెలియజేసాడు. సోమవారం సాయంత్రం వారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. పిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ ఘటనపై పృథ్వీతేజ ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

SHARE