గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల నిర్వహణఫై తలసాని సమీక్ష

మరో వారం రోజుల్లో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు మొదలుకాబోతున్న నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్షా నిర్వహించారు. బుధవారం ఖైరతాబాద్ గణేశ్‌ మండపం వద్ద ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి దర్శనం కోసం వస్తుంటారన్నారు.

భక్తులు, నిర్వాహకులకు ఎలాంటి ఇబ్బందు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఈ సంవత్సరం 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఖైరతాబాద్ వెనుక భాగంలో నివాసం ఉంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఐ మాక్స్ థియేటర్ ఉన్న ట్రాఫిక్ పీఎస్ పక్క నుంచి రహదారి ఏర్పాటు చేస్తున్నామన్నారు.

మినీ ఇండియాగా పిలవబడే హైదరాబాద్ నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు బాధాకరమన్న ఆయన.. కొంతమంది కావాలనే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. ఓ మంత్రిగా కాకుండా, హైదరాబాద్ నగర వాసుడిగా జరుగుతున్న ఘటనలను ఖండిస్తున్నానని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు

SHARE