వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

వ‌న‌స్థ‌లిపురం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఓంకార్ న‌గ‌ర్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఏషియన్‌ పేయింట్స్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు మరో మూడు ఫర్నీచర్‌ గోదాములకు మంటలు విస్తరించాయి.

ఈ ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది..రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్‌ బంక్‌ ఉండగా.. అదృష్టవశాత్తు దానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే సమాయానికి ఫైర్‌ ఇంజిన్‌ రాకపోవడం వల్లే మంటలు అధికంగా వ్యాపించాయని షాప్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

SHARE