ప్రభుత్వ ప్రాజెక్టు లోపాల వల్ల ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోయారు – ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ భారీ వరదలకు రాష్ట్రంలో వందల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటె కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపాలపై ఈరోజు జర్నలిస్ట్ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఈటెల మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రాజెక్టు లోపాల వల్ల ప్రజలు కోట్లాది రూపాయలు నష్టపోయారు. ప్రజలకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇన్ని అనుభవాల తర్వాత ప్రాజెక్టులపై జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టమైందని తెలిపారు. ప్రాజెక్టుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం శాస్త్రీయ పద్దతిలో ఆలోచించాలని సూచించారు. వరదలతో సంబంధం లేకుండా పంట నష్టపోతున్న రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కాళేశ్వరం విషయంలో ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ వినేవాడు కాదు. నేనే డిజైనర్, నేనే సృష్టికర్త అని కేసీఆర్ అనుకునేవాడని ఈటల ఆరోపించారు. ప్రభుత్వానికి మాన్సూన్ ప్రిపరేషన్స్ పై ప్లాన్ లేదు. అందుకే వరదల వల్ల ప్రజలు నష్టపోయారని అన్నారు. ప్రాజెక్టులు కట్టడం నాతోనే స్టార్ట్ అయిందనే లాగా కేసీఆర్ మాట్లాడడం బాధాకరమని వ్యాఖ్యానించారు. నీళ్ళు కావాలని జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం అన్నారు.

SHARE