రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఘాటైన విమర్శలు చేసారు. రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం పట్ల రేవంత్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేయడం ఫై ఈటెల ఫైర్ అయ్యారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రజా సమస్యలపై పోరాడుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందా అని నిలదీశారు. రేవంత్ రెడ్డి స్వార్థం కోసం రాజకీయాలు చేస్తారని.. అలాంటి వ్యక్తి ప్రజల కోసం పనిచేసే రాజగోపాల్ రెడ్డిని విమర్శించడం ఏంటని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి బీజేపీని విమర్శించే స్థాయి ఉందా అని వ్యాఖ్యానించారు.

గతంలో రేవంత్ రెడ్డి పార్టీ మారలేదా అని ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన రేవంత్.. మళ్లీ ఎందుకు ఎంపీగా పోటీ చేశారని నిలదీశారు. రాజకీయం సన్యాసం ఏమైందని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఎవరి చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరు స్వార్థం కోసం పనిచేస్తారు.. ఎవరు ప్రజల కోసం పనిచేస్తారో అందరికీ తెలుసని కామెంట్ చేశారు.

SHARE