టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చిన ఈటెల

అనేక మంది టిఆర్ఎస్ నేతలు…బీజేపీతో టచ్ లో ఉన్నారని పెద్ద బాంబు పేల్చారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన ఈటల… కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం‌ కేసీఆర్ పై పోటీ చేస్తామన్న ఈటల.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తా అని కెసిఆర్ మాట తప్పారని.. అనేక అంశాలు మానిఫెస్టో లో రాసుకొని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి కెసిఆర్ అని నిప్పులు చెరిగారు. ప్రభుత్వ హామీలు, వైఫల్యాల ను ఎండగట్టేందుకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా నేను దేవరకద్ర వెళ్తున్నానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా మా ఆక్షన్ ప్లాన్ ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎగరేది బీజేపీ జెండానేనని పేర్కొన్నారు.

SHARE