మంత్రి ఎర్ర‌బెల్లి సోద‌రుడు ప్ర‌దీప్ రావు..టిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేయబోతున్నాడా..?

అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణ లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే వలసలు మొదలయ్యాయి. అధికార పార్టీ టిఆర్ఎస్ కు రాజీనామా చేసి ఇప్పటికే పలువురు ఇతర పార్టీలలో చేరగా..వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్కు కీలక నేతగా ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7న ఆయన రాజీనామా చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం.

ఈ క్ర‌మంలో బుధ‌వారం వ‌రంగ‌ల్‌లో ఆయ‌న త‌న అనుచరుల‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో తాను టీఆర్ఎస్‌కు ఎందుకు రాజీనామా చేయ‌నున్నాన‌న్న విష‌యాన్ని ఆయ‌న త‌న అనుచ‌రుల‌కు చెప్ప‌నున్న‌ట్లుగా స‌మాచారం. అంతేకాకుండా టీఆర్ఎస్‌కు రాజీనామా త‌ర్వాత త‌న భవిష్య‌త్తు కార్యాచ‌ర‌ణ ఖ‌రారుపైనా ఆయ‌న త‌న అనుచ‌ర వ‌ర్గానికి స్ప‌ష్ట‌త ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా బిజెపి లో చేరతారా లేదా అనేది చూడాలి.

SHARE