చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం విషయంలో తెలంగాణ , ఏపీ నేతలకు ఈడీ నోటీసులు

చికోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారంలో తెలంగాణ, ఏపీలోని పలువురు రాజకీయ నేతలకు ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నట్లు సమాచారం. గత నాల్గు రోజులుగా చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ విచారణ లో పలువురు తెలంగాణ, ఏపీ నేతలకు ప్రవీణ్ తో సంబంధాలు ఉన్నట్లు తేలడం తో వారికీ నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమైంది.

తెలంగాణలోని ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కు నోటీసులు రంగం సిద్ధం చేశారు. థాయిలాండ్ ,మలేషియా, శ్రీలంకలో జరిగిన క్యాసినో వ్యవహారంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు అధికారులు. మరోపక్క చికోటి ప్రవీణ్..తనకు ప్రాణహాని ఉందని పోలీస్ బందోబస్తు కల్పించాలని హైకోర్టు లో రిట్ పిటిషన్ వేసిన చికోటి… అనుమానాస్పద వ్యక్తులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

SHARE