మంచిర్యాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన డీకే అరుణ

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈరోజు శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని పలు కాలనీలు, గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతాలను సందర్శించారు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ ఫై నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబంగా మారిందని.. రాష్ట్ర ప్రజల బతుకులు మాత్రం మారలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.

మంచిర్యాల జిల్లాలో వరద ఉదృతి వల్ల 9వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపింది. సీఎం కేసీఆర్ ఒక ఇంజనీర్ గా మారి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ముంపు ప్రాజెక్టుగా మారిందని విమర్శించారు. ఇతర రాష్ట్రాల్లో రైతులకు సహాయం అందించి.. తెలంగాణ ప్రజలకు మాత్రం కన్నీళ్లు మిగిల్చిన సీఎంగా కేసీఆర్ చరిత్రలోకి ఎక్కాడు అని ఆమె వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లాలో వరద బాధితులకు భరోసా కల్పించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం ప్రజల్లో నెలకొందని ఎద్దేవా చేశారు.

SHARE