కేసీఆర్ ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యం – ఈటెల

ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ని ఓడగొట్టడమే నా జీవిత లక్ష్యం అన్నారు బిజెపి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ప్రస్తుతం రాష్ట్రంలో వలసల పర్వం నడుస్తుంది. అధికార పార్టీ కి గుడ్ బై చెప్పి చాలామంది కాంగ్రెస్ , బిజెపి పార్టీలలో చేరుతున్నారు. ఈ క్రమంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి..బిజెపి లో చేరబోతున్నారు. రాజగోపాల్ చేరితే తెలంగాణ లో బిజెపి కి మరింత బలం చేరుకోరనుంది.

ఇదిలా ఉంటె మరోసారి కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు ఈటెల రాజేందర్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ క్యాంపు ఆఫీస్ లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…రెసిడెన్సీ స్కూల్స్ మొత్తం అద్మణంగా తయారయ్యాయని…ప్రతి రోజు ఎక్కడో దగ్గర విద్యార్థులకు అశ్వస్థతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులు తినే ఆహారం లో వాణపాములు బొద్దింకలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ లకు డబ్బులు ఇవ్వకపోవడం తో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తలేరని మండిపడ్డారు. మంత్రులు స్వతంత్రగా తిరిగి పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదు…ఫామ్ హౌస్ లేకుంటే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి కనీసము పర్యవేక్షణ చేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.

SHARE