శంషాబాద్ ఎయిర్ పోర్టులో దాసోజు శ్రవణ్ కు ఘన స్వాగతం పలికిన బిజెపి నేతలు

రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిజెపి లో చేరిన సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టులో బిజెపి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ నియంతృత్వ ధోరణితోనే కాళేశ్వరం, మేడిపల్లి నీట మునిగిందని..లక్షా యాభై వేల కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ అనాలోచితంగా నీటిపాలు చేశారని విమర్శించారు. కాళేశ్వరం ముంపుపై కనీసం రివ్యూ చేయకపోవడం దుర్మార్గమన్నారు.

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ కేంద్రంపై అనవసర విమర్శలు చేస్తున్నారని శ్రవణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలు కుటుంబ పాలనకు చరమగీతం పాడి బీజేపీని ఆశీర్వదించాలని కోరారు. ప్రజాస్వామిక తెలంగాణ కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజా సమస్యలపై బిజెపి పోరాటం చేస్తూ ప్రజల అభిమానం పొందుతోందని శ్రవణ్ అన్నారు.

SHARE