మునుగోడు ఉప ఎన్నికల బరిలో సిపిఐ…?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే కాదు సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. నిన్నటి వరకు టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ పార్టీలు మాత్రమే బరిలోకి దిగబోతాయని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు సిపిఐ కూడా బరిలోకి దిగాలనే ఆలోచనలో చేస్తుంది.

మునుగోడు నియోజకవర్గం లో ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరుగగా..ఆరుసార్లు కాంగ్రెస్, ఐదు సార్లు సిపిఐ, ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీలో విజయం సాధించాయి. అంటే ఓవరాల్ గా చూస్తే..కాంగ్రెస్, సిపిఐ పార్టీలే ప్రధానంగా పోటీ పడ్డాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ నెల 12న మునుగోడు ఉప ఎన్నికలపై సిపిఐ ముఖ్య నాయకులు సమావేశం కానున్నారు. చండూరులో పార్టీ మండల అధ్యక్షులతో సమావేశం కానున్నట్లు వినికిడి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లా ఈ సమావేశం జరపనున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా? లేక ఎవరికి మద్దతు ఇవ్వాలి అన్నదానిపై చర్చ జరగనుంది. ఒకవేళ సిపిఐ పోటీ చేస్తే నెల్లికంటి సత్యం ని బరిలో నిలిపే దిశగా సిపిఐ ఆలోచన చేస్తుంది.

SHARE