మునుగోడు ఉప ఎన్నిక కు టిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చిన సిపిఐ..

మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. ఈ క్రమంలో ఈ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు సిపిఐ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్నీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

ప్రగతిశీల రాజకీయాలకు సీఎం కేసీఆర్ కంకణబద్దుడై ఉన్నారని, భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్ తో కలిసి వెళ్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తోందన్నారు. మునుగోడులో నిర్వహించే కేసీఆర్ సభకు తమ పార్టీ తరపున పల్లా వెంకట్ రెడ్డి హాజరవుతారని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక అనివార్యంగా తెరపైకి వచ్చిందని, తన స్వార్థ ప్రయోజనాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా బీజేపీని ఓడించేందుకు బలమున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

ఇప్పుడు పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో సీపీఐ ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ర్ట విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ కి చాలా బలహీనతలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ పార్టీ గురించి తానేమీ మాట్లాడదలచుకోలేదన్నారు.

SHARE