మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు

మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే కాదు సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటె మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు చేరుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీలు వరుసగా గులాంబీ కండువాలు కప్పుకుంటున్నారు. బుధవారం తెల్లవారుజామున మర్రిగూడెం మండలం వైస్‌ ఎంపీపీ వెంకటేశ్‌, లెంకపల్లి సర్పంచ్‌ పాక నగేశ్‌, సరంపేట సర్పంచ్‌ వీ.నర్సింహ, ఎంపీటీసీ శ్రీశైలంతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.

SHARE