మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాల్వాయి స్రవంతి ఆడియో కలకలం

మునుగోడు ఉప ఎన్నిక అతి త్వరలో జరగబోతున్న సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఎలాగైనా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ , టిఆర్ఎస్ , బిజెపి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి రెడ్డి ఆడియో కలకలం రేపుతోంది.

చలమల్ల కృష్ణారెడ్డికి పోటీ చేసే అవకాశం ఇస్తారనే ప్రచారంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. తనకు టికెట్‌ ఇవ్వకపోతే హుజురాబాద్‌ వంటి అవమానం మరోసారి జరిగే అవకాశముందని…. పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో.. సోషల్ మీడియా లో హల్‌చల్‌ చేస్తోంది. చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్‌ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ‘‘చండూరు సభ నా వల్లే సక్సెస్‌ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే హుజురాబాద్‌ సీన్‌ రిపీట్‌ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే ఊరుకోను’’ అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్‌ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్‌ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది.

SHARE