కాంగ్రెస్ పార్టీ కి బిగ్ షాక్ : టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ కీలక నేత

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో వలసలు పెరిగిపోతున్నాయి. పలు పార్టీల్లోకి నేతలు కండువాలు మార్చుకుంటున్నారు. తాజాగా బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోర్తాడ్ మాజీ సర్పంచ్ అజీజ్ సోమవారం 500 మంది అనుచరులతో కలిసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలస్యం అయినా అజీజ్ సరైనా నిర్ణయం తీసుకున్నారని, అభివృధి వైపే ఉంటానంటూ తనకు మరింత బలం చేకూర్చేందుకు వచ్చారని అన్నారు. వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. ఈ రోజు నుంచి టీఆర్ఎస్ కుటుంబ సభ్యులని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సర్వతోముఖాబివృద్ది సాధిస్తుందన్నారు. రైతులు, పేదలు రెండు కళ్ళుగా కేసీఆర్ పాలన సాగుతోంది అన్నారు. ఈ మధ్య బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఊర్ల మీద పడి ప్రజలను అయోమయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో ఉన్న అభివృద్ది బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేదని ప్రశ్నించారు..? తెలంగాణలో ఉన్నట్లే తమకు కూడా అభివృద్ది కావాలని బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రజలు అక్కడ నిలదీస్తున్నది వాస్తవం కాదా? అని నిలదీశారు.

SHARE