శంషాబాద్ రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత కుమార్తె దుర్మరణం

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ కుమార్తె తనియా మృతిచెందింది. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాతంరాయి అపర్ణా సర్కిల్ వద్ద ఈరోజు ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో తనియా అక్కడిక్కడే మృతి చెందగా..మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం తో హాస్పటల్ కు తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పటల్ లో తనియా పోస్టుమార్టం జరుగుతుంది. తానియా బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHARE