రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం..

రేపు (ఆగష్టు 4న) సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం ప్రారంభం కాబోతుంది. అలాగే దీంతో పాటు.. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభం కాబోతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. జెండా ఆవిష్కరణ అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ సీసీసీని ప్రారంభిస్తారని సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.

కమాండ్‌ కంట్రోల్‌ రూం బిల్డింగ్ ను ఐదు టవర్లుగా విభజించామని, టవర్ ఏ లోని 18 ఫ్లోర్ లో సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుందని తెలిపారు. 14వ ఫ్లోర్ లో గ్యాలరీ, 5,6,7 ఫ్లోర్లలో కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుందని వెల్లడించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ పూర్తిగా సీఎం కేసీఆర్ సృష్టేనని సీపీ సీవీ అనంద్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు ఇక్కడ నుంచే సమన్వయం చేసేలా.. టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ ఉంటుందని వివరించారు. సీఎం కేసీఆర్ ఆలోచనా మేరకే ఈ అద్భుత రూపకల్పన జరిగిందని , సీసీసీలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని… ఇది పర్యావరణ హిత బిల్డింగ్ అని స్పష్టం చేశారు. కరెంట్ ఖర్చులు తగ్గేలా సోలార్ ప్లాంటు ఏర్పాటు చేశామని వెల్లడించారు. బంజారా హిల్స్‌లో క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ను నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. రేపు ఈ ప్రారంభోత్సవం సందర్బంగా బంజారాహిల్స్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

SHARE