మునుగోడు కు బయలుదేరిన కేసీఆర్

మునుగోడు లో జరుగుతున్న టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ కు ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుండి రోడ్డు మార్గాన బయలు దేరారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు , ఎమ్మెల్యే లు , ఎమ్మెల్సీ లు , ప్రజా ప్రతినిధులు అంత వెళ్తున్నారు. దాదాపు నాల్గు వేలకు పైగా వాహనాలతో వెళ్తున్నారు. సీఎం సభ కోసం 2వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఐదుగురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 25 మంది డిఎస్పీలు, 50మంది సీఐలు, 94 మంది ఎస్సైలు విధుల్లో పాల్గొననున్నారు.

మునుగోడు మ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీ లు ఉప ఎన్నిక ఫై ఫోకస్ చేసాయి. ఈరోజు జరగబోయే టిఆర్ఎస్ ప్రజా దీవెన సభ లో టిఆర్ అభ్యర్థి ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక రేపు బిజెపి సైతం భారీ సభ నిర్వహించబోతుంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ సభ కు హాజరు కాబోతున్నారు. ఇదే సభ లో రాజగోపాల్ రెడ్డి బిజెపి కండువా కప్పుకోనున్నారు.

SHARE