ఈరోజు సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్

తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చర్చ హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 21 న ఆయన బిజెపి లో చేరబోతున్నారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది.

బిజెపి నుండి పోటీ చేసి గెలిచి తీరాలని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తుంది. నిన్న మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పటు చేసి సక్సెస్ అయ్యింది. ఇదిలా ఉంటె..టిఆర్ఎస్ పార్టీ నుండి ఎవర్ని బరిలో దింపుతారనేది ఇప్పుడు చర్చగా మారింది. ఈ క్రమంలో ఈరోజు కేసీఆర్ పెట్టబోయే ప్రెస్ మీట్ ఆసక్తి పెంచుతుంది. ప్రెస్ మీట్ లో కేసీఆర్ ఏం మాట్లాడతారా..మునుగోడు బరిలో నిలిచే అభ్యర్థి ని ప్రకటిస్తారా అనేది దానిపై ఉత్కంఠ నెలకొని ఉంది.

SHARE