రెండో రోజు కూడా కొనసాగుతున్న చికోటి ప్రవీణ్ ఈడీ విచారణ

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ను ఈడీ అధికారులు రెండో రోజు కూడా విచారిస్తున్నారు. తొలి రోజు(ఆగస్టు 1) 10 గంటల పాటు ఈడీ విచారణ కొనసాగింది. చీకోటి ప్రవీణ్, అతడి అనుచరులపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. తమ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. చీకోటి ప్రవీణ్ తో పాటు నలుగురు ఏజెంట్లు మాధవ రెడ్డి, గౌరీ శంకర్, అగర్వాల్, సంపత్ లను కలిపి ఈడీ విచారించింది. విదేశాల్లో నిర్వహించిన 50 గ్యాంబ్లింగ్, ఈవెంట్స్ లావాదేవీలపైన ఈడీ ఆరా తీసింది.

క్యాసినో నిర్వహణ , నగదు చెల్లింపుల పై ఈడి ఆరా తీస్తోంది. ఇక్కడి నుండి ఇతర దేశాలకు కస్టమర్లను తరలించే ముందు కాయిన్స్ విధానం ప్రవేశ పెట్టాడని నిర్ధారించారు. క్యాసినో ఆడేందుకు కస్టమర్ల నుండి నగదు తీసుకుని వారికి ఇక్కడే కాయిన్స్ లు జారీ చేసినట్లు అనుమానిస్తున్నారు. విదేశాల్లో ఆడాలంటే ఇక్కడి కరెన్సీని ఫారిన్ ఎక్సేంజ్ చేయాలి కాబట్టి.. కాయిన్స్ విధానం అమలు చేశాడని సమాచారం. క్యాసినో ముగిశాక ప్రైజ్ మనీ సైతం కాయిన్స్ విధానంలోనే చెల్లింపులు చేశాడని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. విదేశాల్లో కాయిన్ తీసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చాక నగదు చెల్లింపులు చేసినట్లు ఈడీ భావిస్తోంది. చెలింపుల ద్వారా ఫెమా ఉలంఘనకు చికోటి అండ్ టీమ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఈ క్రమంలో విదేశీ ఖాతాలను సైతం గుర్తించారు. వాటి ద్వారా ఎలాంటి చెల్లింపులు జరిగాయో పరిశీలిస్తున్నారు. చికోటికి సంబంధించిన ల్యాప్ టాప్ లో డేటాను విశ్లేషిస్తున్నారు. థాయిలాండ్‌, నేపాల్‌, ఇండోనేషియా సహా మొత్తం 7 దేశాల్లో నిర్వహిస్తున్న క్యాసినోలకు పెట్టుబడులు పెట్టిన వారి గురించి ఆరా తీసినట్లు సమాచారం. క్యాసినో కేసులో రెండో రోజు ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ ను ప్రశ్నిస్తున్నారు. క్యాసినో నిర్వహణ, నగదు చెల్లింపులపై ఈడీ ఆరా తీస్తోంది. ఈరోజు బ్యాంక్ స్టేట్ మెంట్స్ తో ఈడీ విచారణకు చికోటి ప్రవీణ్ హాజరయ్యారు.

SHARE