ఈడీ విచారణపై చీకోటి ప్రవీణ్‌ స్పందన

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ను ఈడీ అధికారులు విచారించబోతున్నారు. దీనికి సంబదించిన నోటీసు లు జారీ చేసారు. నిన్నటి నుండి ప్రవీణ్ తో పాటు మాధవ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈరోజు ఉదయం వరకు సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను తీసుకెళ్లారు. అనంతరం నోటీసులు జారీ చేసారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.

దీనిపై చీకోటి ప్రవీణ్‌ స్పందించారు. ఈడీ విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చానని.. సోమవారం మళ్లీ విచారణకు హాజరుకావాలని చెప్పినట్లు తెలిపారు..”గోవా, నేపాల్‌లో క్యాసినో లీగల్ కాబట్టే నిర్వహించాం. క్యాసినోపై ఈడీ అధికారులకు సందేహాలున్నాయి. వాటి గురించి వివరణ అడిగారు. సోదాల్లో అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నాకు ఈడీ నోటీసులు ఇచ్చారు. రేపు వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు చెబుతాను.” అని తెలిపారు.

SHARE