19 ఏళ్ల తర్వాత భద్రాద్రి సీతారాములను దర్శించుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 19 ఏళ్ల తర్వాత భద్రాద్రి సీతారాములను ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుచంద్రబాబు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు.

గోదావరి ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. బూర్గంపాడు నుంచి అర్థరాత్రి ఒంటి గంటకు భద్రాచలం చేరుకున్న చంద్రబాబుకు దారిపొడవునా జననీరాజనం పలికారు. జనం ఉత్సాహం చూసి చంద్రబాబు… ఓపికగా వారితో మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ పేరు చరిత్రలో నిలిచి ఉంటోందన్నారు. భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతో తెలుగుదేశం పాలన దూరదృష్టి ఏంటో తెలిసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 20 ఏళ్ల క్రితం గోదావరి కరకట్ట నిర్మించాం. దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని పనులు చేశాం. 1986లోనూ వరదలు వస్తే భద్రాచలం ముంపునకు గురైంది. మనం చేసిన అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది. భవిష్యత్తులో విపత్తు లేకుండా పనులు చేపట్టాల్సి ఉంది. కరకట్ట నిర్మించి శాశ్వత పరిష్కారం జరిగే వరకు పోరాడతాం అన్నారు. గోదావరి వరదలతో సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న వరద బాధితులను ప్రభుత్వాలే అన్ని విధాలా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వరద బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

SHARE