ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు

టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదైంది. 2020 లో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై ఓ వ్యక్తి పిర్యాదు చేసాడు. బాల కిషన్ నుండి ప్రాణహాని ఉంది.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి అందించాడు బాధితుడు. దాదాపు రెండేళ్ల తర్వాత స్పందించిన పోలీసులు… మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాల కిషన్ పై కేసు నమోదు చేశారు.

సెక్షన్ 290, సెక్షన్ 506 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.. రసమయిపై సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటె ఎమ్మెల్యే రసమయి బాల కిషన్.. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కు టచ్‌ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయనతో పాటు పలుగురు నాయకులకు కూడా ఈటల ఫోన్‌ చేశారట. మరి ఈ ప్రచారం లో ఎంత నిజం ఉందొ తెలియాల్సి ఉంది.

ఇదిలాఉంటే తెలంగాణలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. రాష్ట్ర నాయకత్వంతో పాటు కేంద్ర అగ్ర నాయకత్వంసైతం తెలంగాణపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని అసంతృప్త నేతలను బీజేపీలోకి చేర్చుకొనేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీజేపీ మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ కు తెలంగాణలో గట్టి ఎదురు దెబ్బతగిలింది.

SHARE