లిక్కర్ స్కాం అనగానే కవితకు ఎందుకంత భయం – బిజెపి ఎంపీ సుధాంశు త్రివేది

ఢిల్లీ లిక్కర్ స్కాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంతో కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంబంధం ఉందని బిజెపి ఎంపీలు చేసిన ఆరోపణలపై కవిత స్పందించింది. మరోపక్క బిజెపి శ్రేణులు కవిత ఇంటివద్ద ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తనకు ఢిల్లీ లిక్కర్ స్కాం తో ఎలాంటి సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉన్నవారి గురించి తాము చేసిన ఆరోపణలు విని.. ఎమ్మెల్సీ కవిత ఎందుకంత భయపడిపోతున్నారో అర్ధం కావడం లేదని ఢిల్లీ బీజేపీ ఎంపీలు సుధాంశు త్రివేది, పర్వేశ్ వర్మ అన్నారు.

లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై ఆధారాలు ఉన్నాయా ? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఎంపీ పర్వేశ్ బదులిస్తూ.. ‘‘కవితను ఉద్దేశించి నేను చేసిన ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీ చేస్తుంది. ఎంక్వయిరీ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరున్నారు అనే నిజానిజాలు బయటికి వస్తాయి’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రభుత్వంలో ఉన్నా.. అవినీతి చేయడం వాళ్లకు కొత్తేమీ కాదు. సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారన్న కవిత , ప్రతిపక్షాల వ్యాఖ్యలు కూడా కొత్తేం కాదు. ఢిల్లీ కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, బొగ్గు కుంభకోణంలో ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకులు లేరా? ’’ అని ఎంపీలు సుధాంశు, పర్వేశ్ కామెంట్స్ చేశారు.

SHARE