టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నిజామాబాద్ బీజేపీ కార్పొరేట‌ర్

ఎన్నికల సమయం ఇంకా ఉన్నప్పటికీ ఇప్పటి నుండి వివిధ పార్టీలలోకి వలసలు వచ్చి చేరుతున్నాయి. బిజెపి , టిఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల్లోని పలువురు పార్టీల కండువాలు మార్చుకుంటున్నారు. తాజాగా సోమవారం నిజామాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందిన‌ 23వ డివిజ‌న్ బీజేపీ కార్పొరేట‌ర్ మ‌ల్లేష్ యాద‌వ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మ‌ల్లేష్ యాద‌వ్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నార‌ని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పాల‌న‌లో అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు.

SHARE