మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నిక చర్చ నడుస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ , బిజెపి , టిఆర్ఎస్ పార్టీలు మాత్రమే కాదు సిపిఐ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటె టిఆర్ఎస్ పార్టీ కి భారీ షాక్ తగిలింది.

మంత్రి జగదీష్‌రెడ్డి ఇంట్లో ఈరోజు మునుగోడు నియోజకవర్గ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌లను మంత్రి జగదీష్‌ రెడ్డి పిలిపించుకుని మాట్లాడారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ నేత కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొదని వారు అసమ్మతి గళం వినిపించారు. కూసుమంట్లకు టికెట్‌ ఇస్తే ఎన్నికల్లో సపోర్టు చేసేదిలేదంటు తేల్చి చెప్పారు. ఈ విషయంపై వారం క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసమ్మతి నేతలు లేఖలు రాసినట్టు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆదేశాలతో మంత్రి జగదీష్‌ రెడ్డి అసమ్మతి నేతలను బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది.

SHARE