మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి కామెంట్స్

మునుగోడు లో ఉప ఎన్నిక తథ్యం అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈయన వ్యాఖ్యలు బట్టి చూస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి , బిజెపి నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ తరుణంలో మునుగోడులో ఉప ఎన్నికపై భట్టి కామెంట్స్ చేసారు.

భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఉప ఎన్నిక కోరుకోవడం లేదు. రాజగోపాల్‌రెడ్డితో అధిష్టానం మాట్లాడుతోంది. ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కారం చేస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఆయన పార్టీలోనే ఉండేలా చూస్తాము అని అన్నారు.

ఇక ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మునుగోడులో ఉప ఎన్నిక ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మునుగోడులో ఉపఎన్నిక వస్తే టీఆర్ఎస్సే గెలుస్తుందని , తమకు కావాల్సిన మెజారిటీ ఉందని..ఉప ఎన్నికను కోరుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఉపఎన్నిక వస్తే రాజగోపాల్ రెడ్డిని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నల్గొండ జిల్లాలో మునుగోడు ఒక్క స్థానంలోనే టీఆర్ఎస్ లేదని..ఇప్పుడు అక్కడ కూడా టీఆర్ఎస్ పాగా వేస్తోందని ధీమా వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రజలను అయోమాయానికి గురి చేస్తున్నారని లింగయ్య యాదవ్ అన్నారు. ఆయన ప్రజలకు ఆందుబాటులో ఉండరని.. టీఆర్ఎస్ వల్లే మునుగోడు అభివృద్ధి జరిగిందన్నారు.

SHARE