కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపి తో టచ్ లో ఉన్నారు – బండి సంజయ్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో బాంబు పేల్చాడు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా బిజెపి తో టచ్ లో ఉన్నారని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి , తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ లో పడింది. ఇప్పుడు వెంకట్ రెడ్డి కూడా టచ్ లో ఉన్నాడని బండి సంజయ్ తెలుపడం తో కాంగ్రెస్ శ్రేణుల్లో మరో కలవరం మొదలైంది. అంతే కాదు అధికార పార్టీ టిఆర్ఎస్ నేతలు సైతం బిజెపి లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని , ఒక్క మునుగోడు మాత్రమే కాదు రాష్ట్రంలో పలుచోట్ల ఉప ఎన్నికలు రావడం తధ్యమన్నారు.

క్యాసినో డ్రగ్స్ కేసులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు సంజయ్. మంత్రుల తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే జోకర్లలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేకోటి ప్రవీణ్ వెనుక ఉన్నది.. కెసిఆర్ కుటుంబ సభ్యులేనని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి.

SHARE