యాదగిరిగుట్టకు చేరుకున్న బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టబోతున్నారు. ఉదయం ఖైరతాబాద్ అమ్మవారి టెంపుల్ లో పూజలు చేసిన బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి యాదాద్రి కి చేరుకున్నారు. ఘట్కేసర్ లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు బండి సంజయ్ స్వాగతం పలికారు. ఘట్కేసర్ లోని పార్టీ ఆఫీసులో కేంద్రమంత్రిని బండి సంజయ్ సన్మానించారు. ఈ మూడో విడత యాత్రకు బిజెపి శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. దారి మధ్యలో ఉప్పల్ లో సంజయ్ కు లోకల్ లీడర్లు భారీ స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే NVSS ఫ్రభాకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం చెప్పారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ కూడా పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చారు.

అక్కడి నుంచి కేంద్రమంత్రితో కలిసి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఈ క్రమంలోనే బీబీనగర్, భువనగిరిలో బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న బండి సంజయ్.. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శంచుకొని ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం యాదగిరిగుట్ట పట్టణ శివారులోని వంగపల్లి గ్రామంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. నేడు పది కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. రాత్రికి బస్వాపూర్ లో బస చేస్తారు. ఈ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర మొత్తం 24 రోజులపాటు కొనసాగనుంది.328 కిలోమీటర్లు నడవనున్నారు బండి సంజయ్. మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 మండలాల్లో సంజయ్ పాదయాత్ర చేయనున్నారు.

SHARE