లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మార్చడానికి పాదయాత్రను అడ్డుకున్నారు – బండి సంజయ్

bandi sanjay kumar fire to kcr govt
bandi sanjay kumar fire to kcr govt

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆరోపణలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై బిజెపి కార్య కర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ తరుణంలో బండి సంజయ్ పాదయాత్ర ను అడ్డుకోవడం..అరెస్ట్ చేసి ఇంటికి తరలించడం ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం కేసీఆర్ ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. లికర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. కూతురుకో న్యాయం…? ఇతరులకో న్యాయమా..? అని నిలదీశారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి టీఆర్ఎస్ కు భయం పట్టుకుందని.. అందుకే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

SHARE