బండి సంజయ్ అరెస్ట్..టిఆర్ఎస్ ఫై ఆగ్రహంతో ఊగిపోతున్న బిజెపి శ్రేణులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా దీక్ష చేయాలని ప్రయత్నిస్తే.. అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నింస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ నిర్వహించిన బహిరంగసభ ఫెయిల్ అయ్యిందిని.. బీజేపీ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ కావడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని, ప్రగతిభవన్ ప్లాన్ లో భాగంగానే బండి సంజయ్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు.

రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, బీజేవైఎం నేతల అరెస్టుపై దీక్ష చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. మంగళవారం దీక్షకు సిద్ధమౌతున్న క్రమంలో.. పోలీసులు ఒక్కసారిగా దూసుకొచ్చి.. ఆయన్ను అరెస్టు చేశారు. బండి సంజయ్ ను పోలీసులు ఆయన ఇంట్లో వదిలిపెట్టారు. జనగామ జిల్లాలోని పామునూరు వద్ద ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారన్న విషయంపై మొదట క్లారిటీ ఇవ్వలేదు. సిద్ధిపేట, కరీంనగర్ పీఎస్ కు తరలిస్తారని ప్రచారం జరిగినా చివరకు ఇంటికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

SHARE