ఈటెల విశ్వాస ఘాత‌కుడు – బాల్క సుమన్

బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం‌ కేసీఆర్ పై పోటీ చేస్తామన్న ఈటల.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని అన్నారు. ఈ వ్యాఖ్యల ఫై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు విమర్శలు కురిపించగా..తాజాగా ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్..ఈటెల ఫై ధ్వ‌జ‌మెత్తారు.

ఈటెల రాజేంద‌ర్ విశ్వాస ఘాత‌కుడు అని, ఆయ‌న తిన్నింటి వాసాల‌ను లెక్క‌బెట్టార‌ని మండిప‌డ్డారు. 2004కు ముందు ఈటెల అడ్ర‌స్ ఎక్క‌డ‌..? ఈటెల‌ను మంత్రి చేసింది కేసీఆర్ క‌దా? అని సుమ‌న్ ప్ర‌శ్నించారు. ఈటెల రాజేందర్ మాటలను చూసి జనం నవ్వుకుంటున్నార‌ని సుమ‌న్ పేర్కొన్నారు. ఆయ‌న శిఖండి రాజ‌కీయాలు చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఈటెల అవినీతికి పాల్ప‌డ్డాడ‌ని మండిప‌డ్డారు. రాబోయే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో రాజేంద‌ర్ ఓట‌మి ఖాయ‌మ‌న్నారు. అందుకే గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేస్తాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈటెల కేసీఆర్‌పై పోటీ చేసే సిపాయా? అని ప్ర‌శ్నించారు. ఆయ‌న ఓ చెల్ల‌ని రూపాయి అని విమ‌ర్శించారు. ప‌బ్లిసిటీ కోస‌మే ఈటెల ఈ తంటాలు ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. బీజేపీలో ఈటెల‌ది బానిస బ‌తుకు అని తెలిపారు.

SHARE