ఆర్మూర్ లో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిహత్య కుట్రకు నిరసనగా టీఆర్ఎస్ నేతలు ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ ను పాటిస్తున్నాయి.

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ తన హత్యకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశారని బంజారాహిల్స్ పోలీసులకు జీవన్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బుల్లెట్లులేని ఒక నాటుతుపాకీ, పెల్లెట్లు ఉన్న ఒక ఎయిర్‌‌‌‌‌‌‌‌ పిస్టల్, కత్తి స్వాధీనం చేసుకున్నారు.

కల్లెడ సర్పంచ్ లావణ్యపై వచ్చిన అవినీతి ఆరోపణలతో పంచాయతీరాజ్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఆమెను 6నెలల సస్పెండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. దీనికి కారణం జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అని అనుమానంతో ఆమె భర్త ప్రసాద్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ప్రసాద్.. జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లడం..ఆయన్ను సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పజెప్పడం జరిగింది.

SHARE