బిజెపి కార్యకర్త ఇంట్లో టి తాగిన అమిత్ షా

మునుగోడు పర్యటన లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా..ముందుగా సికింద్రాబాద్ లోని మహాకాళి అమ్మవారిని దర్శించుకొని..ఆ తర్వాత సాంబమూర్తి నగర్ కాలనీలోని కళాసిగూడలో ఉన్న బీజేపీ కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. అనంతరం సత్యనారాయణ అందించిన వేడివేడి కాఫీని అమిత్ షా తాగారు. కాఫీ తాగుతూ.. సత్యనారాయణ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సత్యనారాయణ ఇంటికి అమిత్ షా చేరుకోగానే స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆయనను కలిసేందుకు పోటీపడ్డారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేశారు. సత్యనారాయణ ఇంట్లోకి కేవలం అనుమతి ఉన్న అతికొద్ది మందిని మాత్రమే అనుమతించారు.

ఈ సందర్బంగా సత్యనారాయణ మాట్లాడుతూ..‘‘ఈ రోజు మా జన్మ ధన్యమైంది. మొత్తం దేశానికి హోం మంత్రిగా ఉన్న వ్యక్తి .. చిన్నపాటి బస్తీలో ఉన్న మా ఇంటికి రావడం నిజంగా గొప్ప అదృష్టం. మేం దీన్ని జీవితాంతం మర్చిపోలేం. నిన్నటి నుంచి మా కాలనీలో పండుగ వాతావరణం ఉంది. అమిత్ షా కోసం వేయికళ్లతో ఎదురుచూశాం. ఆయన మా ఇంటికి రాగానే ఆనందాన్ని ఆపుకోలేకపోయాం’’ అని వారు చెప్పుకొచ్చారు.

SHARE