సికింద్రాబాద్ లో కార్యకర్త ఇంటికి వెళ్లిన కేంద్ర మంత్రి అమిత్ షా

మునుగోడు పర్యటన లో భాగంగా బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా కొద్దీ సేపటి క్రితం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ సాదర స్వాగతం పలికారు.

అనంతరం కేంద్ర మంత్రి అమిత్ షా బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆయుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ లోని ఓ కార్యకర్త ఇంటికి అమిత్ షా వెళ్లారు. కార్య కర్తతో 20 నిమిషాల పాటు మాట్లాడనున్నారు. ఆ తర్వాత మునుగోడు కు వెళ్లనున్నారు.

SHARE